తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో పోలేరమ్మ తల్లి కొలుపుల వార్షికోత్సవం
ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో
ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కలు చెల్లించారు. అధిక
సంఖ్యలో భక్తులు, బంధు మిత్రులు రాకతో గ్రామం నూతన కళ
సంతరించుకున్నది. గ్రామ పెద్దలు, పోలేరమ్మ తల్లి కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలను పర్యవేక్షించారు.

