బెంగుళూరు, ముప్పవరం గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్లు పొలాలను సోమవారంఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరావు పరిశీలించారు. మల్కాపురం, తాళ్లూరులలో కొన్ని సర్వే నంబర్లను అక్కడక్కడ పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారికి అందుతున్న నష్టపరిహారం గురించి వాకబు చేసారు. ఎవైనా సాంకేతిక ఇబ్బందులతో నష్టపరిహారం అందని రైతులు అందరికి త్వరలోనే అందుతుందని చెప్పారు. సిబ్బందికి తగిన సూచనలు చేసారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, సర్వేయర్ బాబురావు, వి. అర్ ఓ లు పమిడి చంద్రశేఖర్ రావు, నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే భూములను పరిశీలించిన ఆర్డీఓ
26
Jun