ఎస్సీ ,ఎస్టీ స్వయం సహాయక సంఘాలు ఆర్థిక అభివృద్ధి వైపు పయనించాలి .వి. ఎ. ఎ వై నాగమల్లేశ్వరి

ఎస్సీ ఎస్టీ స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉన్నతి పథకం ద్వారా మార్కెట్ సదుపాయాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకొనుట ద్వారా స్వయం సహాయ సంఘాలు  ఆర్థిక అభివృద్ధి  పెంపొందించుకోవడానికి ఎక్కువ  అవకాశం ఉన్నాయి అని  దారoవారిపాలెం వ్యవసాయ సహాయకులు వై.నాగమల్లేశ్వరి  తెలియజేశారు.  దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం ఏరియా డిబిఆర్సి కో-ఆర్డినేటర్ గోపన బోయిన వెంకట్రావు అధ్యక్షతన మండల స్థాయిలో జరిగిన దళిత ఆదివాసి మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమం లో సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్ ఎం రాజేష్ మాట్లాడుతూ ....రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఆధార్ లింకేజీ మీద ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించిందని పశువులు ఉన్న ప్రతి రైతులు గ్రామ సచివాలయాలకు వెళ్లి ఏ పశువులకు ఇన్సూరెన్స్ చేయించు కొనుట ద్వారా వచ్చే నష్టపరిహారం  పొందవచ్చు అని అన్నారు. డి బిఆర్సి రీజనల్ కో-ఆర్డినేటర్  దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ  మండలస్థాయి లొఎస్సీ,ఎస్టీ స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్  నిధుల ద్వారా  స్వయం సహాయక సంఘాలను  అభివృద్ధి పరచుటకు    ఉన్నతి ,ఆసరా పథకాలు ద్వారా ఆహార ఉత్పత్తులు తయారు చేసుకునే లఘు పరిశ్రమల ద్వారా ఆర్థికంగా స్థిరపడే వరకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నందున ఆ దిశగా ఎస్సీ,ఎస్టీ స్వయం సహాయక సంఘాలొని మహిళలు ఆర్థిక అభివృద్ధి వైపు పయనించాలని.మహిళలు దారిద్ర రేఖకు దిగువనున్న వారు ఆర్దికంగా  స్థిర పడుటకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఎక్కువ   అవకాశం ఉన్నందున మహిళలు గ్రామస్థాయిలో ప్రతిఒక్కరూ స్వయం సహాయక సంఘాల్లో  చేరాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ ఆబోతు చిరంజీవి, గోపనబోయిన అంజమ్మ  వివిధ గ్రామాల్లోని  ఎస్సీ ఎస్టీ మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *