మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసు కోవద్దని సీనియర్ సివిల్ జడ్జి జీఎల్వీ ప్రసాద్ సూచించారు. సోమవారం జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయవ్యవస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ప్రసాద్ మాట్లాడుతూ …డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, సారా వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే అనారోగ్యం పాలు కావడమే కాకుండా ఆరోగ్య పరంగా నష్టపోతారన్నారు. అక్రమంగా మత్తు పదార్థాలు తరలించడం నేరమని చెప్పారు.
