పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందించడానికి జగనన్న సురక్ష సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఎల్ ఓ బి. నాగమల్లేశ్వర రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని విఠలాపురం గ్రామ సచివాలయం నందు సోమవారం వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరువయ్యాయని, ఇంకా ఎవరైనా లబ్ది పొందనట్లయితే జగనన్న సురక్ష సర్వే ద్వారా వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు కుల,మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని ఆయన తెలిపారు . సర్వే సక్రమంగా నిర్వహించి ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు లేకుండా లబ్ధి చేకూరేటట్లు చూడవలసిన బాధ్యత అందరిపై ఉన్నదని ఆయన అన్నారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
పథకాలు అందించేందుకే జగనన్న సురక్ష -ఎంఎల్ ఓ బి. నాగమల్లేశ్వర్ రెడ్డి
27
Jun