*ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అద్భుత అవకాశం*
జూన్ 30వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం
750రూ’ల అపరాధ రుసుముతో జూలై 7 వరకు అవకాశం
బీటెక్ తో పాటు ఎమ్ టెక్ వరకూ చదువుకునే అవకాశం
విద్యార్థుల నుండి అనూహ్య స్పందన
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
నాలుగవ పారిశ్రామిక విప్లవం ఊపందుకుంటున్న వేళ ఇంజనీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది.ఇంజనీరింగ్ విద్య లోని వివిధ రంగాలైన మెకానికల్,సివిల్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో కృత్రిమ మేధస్సు తన రెక్కలను విప్పుతోంది.ఈ పరిణామాల వలన ప్రతీ విభాగంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో కంప్యూటర్లు పరిజ్ఞానంతో “త్రీడీప్రింటింగ్” సాంకేతికత ఉపయోగించి నిర్మాణ రంగంలో అద్భుతమైన రూపకల్పన చేస్తున్నారు.ఇటువంటి అసాధారణ మైన అద్భుతమైన సాంకేతికత అందిపుచ్చుకుని బహుళజాతి కంపెనీలలో ఉద్యోగావకాశాలు పొందాలంటే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించ వలసి ఉంది.ఆ ఆవశ్యకతను అర్థం చేసుకున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2009 విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ విద్యను ప్రవేశపెట్టి నేటి వరకు 14 సం”లకు పైగా ఎంతో మంది ఇంజినీర్లను సమాజానికి అందించింది. ఈ క్రమంలో భాగంగా నేడు ఈ విద్యా సంవత్సరం నుండి సమాజానికి అవసరమైన వైజ్ఞానిక రంగము,అధునాతన సాంకేతిక రంగం లో విశిష్ఠ మైనటు వంటి మరిన్ని కోర్సులను వినూత్న రీతిలో బీటెక్ నుండి ఎమ్ టెక్ వరకూ విద్యాభ్యాసం అందించేలా రూపకల్పన చేయడం జరిగినది.అందుకోసం ఎ. ఎన్.యు.ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్ష దరఖాస్తు తేదీ ఈ నెల జూన్ 30 వ తేదీ తో ముగియనున్నదని అధికారులు తెలిపారు.
750 రూపాయల అపరాధ రుసుముతో జులై 7 వ తారీఖు వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల నుండి పలు విజ్ఞప్తులు రావడంతో విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల చివరి తారీఖు వరకు ఈ అవకాశం కల్పించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు విశ్వ విద్యాలయ ప్రవేశాల విభాగం సంచాలకురాలు ఆచార్య డా.జీ. అనిత వెల్లడించారు.బీ టెక్ నుండి ఎమ్ టెక్ వరకూ విద్యాభ్యాసం కొనసాగేలా నాగార్జున విశ్వవిద్యాలయం ప్రయత్నాలు ప్రారంభించింది.ఇందులో భాగంగా వినూత్నముగా రూపకల్పన చేయడం వలన ఈ ప్రవేశ పరీక్ష అధిక ప్రాధాన్యత ను సంతరించుకుంది.అందుకే విద్యార్థుల అభ్యర్థనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.హల్ టికెట్ ల జారీ,ప్రవేశ పరీక్ష ఖరారు ఎప్పుడనేది త్వరలో చెప్తామని అధికారులు పేర్కొన్నారు.డా.వై ఎస్ ఆర్ ఎ. ఎన్.యు. ఇంజనీరింగ్ కళాశాల పీఠాధిపతి అకడమిక్ డీన్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డా.ఈదర శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్,సైబర్ సెక్యూరిటి,ఎ.ఐ&ఎమ్.ఎల్ ,సి ఎస్.ఇ, మెకానికల్ ఇంజినీరింగ్,ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ,సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులను అనుభవజ్ఞులైన నిష్ణాతులైన అధ్యాపకులతో బోధించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డా.పి. సిద్దయ్య మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విశ్వవిద్యాలయం బీటెక్ మరియు ఎమ్ టెక్ విద్యను అందిస్తోందని విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలలో సైతం అధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా విద్యార్థులకు తగిన శిక్షణనివ్వడం జరుగుతున్నదని వివరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష దరఖాస్తు కు అతి తక్కువ రోజులు మాత్రమే ఉండటం తోజూన్ 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ,ఎ. ఎన్.యు.ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 చైర్మన్ ఆచార్య డా.పి. రాజశేఖర్ మాట్లాడుతూ ఇంజనీర్ల చేతి లోనే దేశాభివృద్ధి ఉందని అన్నారు.అపార మైన పరి శోధనలకు ,ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు నెలవు గా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉందని తెలిపారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో ని విద్యార్థినీ విద్యార్థులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వివరాలకు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
ANUCEET-2023 కు సంబంధించిwww.anu.ac.in లేక www.anucet.in వెబ్ సైట్ ల నుండి సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. సమాచారం కావలసిన ఆశావహులు మరిన్ని వివరాలకు 0863-2346171, 0863-2346138, 9440258811, 9440258822 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.