దర్శి ఏఎంసి పదవీకాలం మరో వారం పది రోజుల్లో ముగియనుంది. ఇదే తరుణంలో కొత్త రాగం దర్శిలో చెక్కర్లు కొడుతుంది. 50 ఏళ్ల దర్శి ఏఎంసి చరిత్రలో ఇప్పటివరకు ఏఎంసి పదవి మహిళలకు దక్కక పోవడంతో ఇది కూడా పలు విమర్శలకు తావిస్తుంది. దర్శి నియోజకవర్గంలో మహిళలు పెద్ద పదవులకు అర్హులు కారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా పార్టీ కోసం మహిళలుగా మేము కష్టపడ్డాం, ఖర్చు పెట్టుకున్నాం, నష్టపోయాం అంటూ కొందరు మహిళలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటివరకు తొమ్మిది మంది వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులు పొందినప్పటికీ వారిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. ఈసారైనా మహిళలకు పెద్ద పీట వేస్తూ అవకాశం కల్పిస్తారా లేరా అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా కనీస గుర్తింపు ఇవ్వడం లేదంటూ దర్శి నియోజకవర్గానికి చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ నాయకురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలంటూ కొందరు మహిళ కార్యకర్తలు కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏఎంసి పదవి మహిళలకు దక్కేనా…? -50 ఏళ్లుగా మహిళలకు అందని ఏఎంసీ -దర్శి ఏఎంసి చరిత్రలో మహిళలకు నో..?- పార్టీ కోసం కష్టపడ్డ ఫలితం లేదంటూ మహిళ నాయకురాలు తీవ్ర ఆవేదన
28
Jun