వ్యవసాయంలో మహిళా రైతులది కీలకపాత్ర, అని, సాగులో సగభాగం మహిళలే భాధ్యతా యుతంగా పనిచేసి, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, కాబట్టి వారి ద్వారా, మహిళా సంఘాల సభ్యుల ద్వారా చైతన్యవంతులను చేసి సాగు విధానాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి B. ప్రసాదరావు తెలిపారు.
మండల మహిళా సమాఖ్య ప్రతినిధులతోను, వివిధ గ్రామాల నుండి హాజరైన వి.వి.ఎ లతోను ఏ. ఓ మాట్లాడుతూ మహిళా రైతులు , రైతు భరోసా కేంద్రాలతోలోని వి.ఎ. ఎ లు కలిసి పని చేయాలని, చిరుధాన్యాలపైన అందరిని చైతన వంతులను చేసి, సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలని, మిని కిట్లను సద్వినియోగం చేసుకొని, ప్రతీ ఇక్కరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించేలా కృషి చేయగలని తెలిపారు.
కార్యక్రమంలో ఎ.పి.యం పి. దేవరాజీ మండల సమాఖ్య అధ్యక్షరాలు విజయలక్ష్మి , సి.సి కోటీశ్వరమ్మ, వి.ఓ.ఎలు, మహిళలు పాల్గొన్నారు.
