గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి- ఎంపీడీవో వై శ్రీనివాసరావు

గ్రామాల్లో గృహనిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో వై.శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీడీవో సమావేశం మందిరంలో బుధవారం సమావేశం జరిగింది. గ్రామాల్లో గృహనిర్మాణాల్లో విఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ టీమ్ పర్యటించి గృహలబ్ధిదారులు వేగవంతంగా నిర్మించుకునేలా చూడాలన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేందుకు అనాసక్తిగా ఉంటే లబ్ధిదారుల వద్ద నుండి తగువివరణ లిఖితపూర్వకంగా తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహిస్తే చర్యలకు సిఫార్సు చేయటం జరుగుతుందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వ హణలో అలసత్వం ప్రదరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వలంటీర్ల మొమోలు జారీ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెవిప్రసాద్, ఈఓఆర్ కెజిఎస్ రాజు, హౌసింగ్ ఇంచార్జి కె . కోటిరెడ్డి, ఏపీఎమ్ దేవరాజ్, గ్రామకార్యదర్శులు, విఆర్వోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *