బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్ ను పఠించారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని తెలిపారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు తరలి రావడంతో ఈద్గాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముస్లిం సోదరులు ప్రార్ధన అనంతరం ఒకరినొకరు ఆలింగనము చేసుకుంటూ పరస్పర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బంధువులు స్నేహితులకు తమ నివాసాల్లో విందు ఏర్పాట్లు చేశారు. పలులో ప్రాంతాల్లో. వైసీపీ నాయకులు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం భాష, జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఆదామ్ షరీఫ్, మల్కాపురం లో సర్పంచ్ వలి, వైసిపి మైనార్టీ సెల్ జిల్లా సంయుక్త కార్యదర్శి సయ్యద్ లతీఫ్ ,కోఆప్షన్ సభ్యుడు కరిముల్లా ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు.
