ప్రకాశం జిల్లా మిట్టపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం కవర్ చేస్తున్న ఓ టీవీ జర్నలిస్ట్ పై వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా సభ్యులు దాడి చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షు డు ఐ.వి.సుబ్బారావు ఖండించారు. కొండపి సీఐ పాండురంగారావుకు ఫోన్ చేసి జ ర్నలిస్ట్ పై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరా రు. అంతకు ముందు యూనియన్ నాయకులు, జర్నలిస్టులతో కలిసి బాధితుడు పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా సభ్యు లు, కార్యకర్తలు తనను కులం పేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు.
జర్నలిస్ట్లపై దాడికి ఏపీయూడబ్ల్యూజే ఖండన
30
Jun