*రాష్ట్రంలో అధికార వైసీపీ సైలెంట్ గా తన ఓటు బ్యాంకును పెంచుకుంటున్నది. ఆదే విషయం పలు రహస్య సర్వేల్లోనూ నిర్ధారణ అవుతున్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ మరింత పట్టు పెంచుకుంటున్నదని నివేదికలు చెబుతున్నాయి.*
అధికారం లో ఉన్న పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం సర్వసాధారణం. ఆ వ్యతిరేకతను వీలైనంత వరకు తగ్గించుకునే ప్రణాళికలను రూపొందిం చుకోవడంలో కొన్ని పార్టీలు సక్సెక్ అవుతుంటా యి. మరికొన్ని విఫలమవుతుంటాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో అధికారం లో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కంటే అనుకూల వాతావరణమే ఎక్కువగా కనిపిస్తున్నది. 2019 నాటి పరిస్థితుల కంటే ప్రస్తుతం వైసీపీ తన బలాన్ని మరింత పెంచుకు న్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రిగా వైఎస్.
జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపుగా నాలుగు సంవత్సరాల మూడు నెలలు దాటి పోతున్నది. ఎన్నికలు కూడా మరో 9నెలల్లో జరగబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రితో పాటు వైసీపీపై ప్రజల్లోనూ, పార్టీ క్యాడర్లోనూ వ్యతిరేకత పెరగాలి. అయితే రాష్ట్రంలో మాత్రం అటువంటి పరిస్థితి. కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రభుత్వంపై మరింత ఆదర జపెరిగినట్లు కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో 60 శాతం మందికిపైగా గ్రామీణ ప్రజలు మద్దతుగా నిలిచారు. 2024
సమయానికి 70 శాతానికి పైగా గ్రామీణ ప్రాంత ప్రజలమద్దతు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పల్లెల్లో అత్యధిక శాతం మంది జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు, మంత్రులపై కొన్ని ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ జగన్ ను చూసి గ్రామీణ ప్రజలు మరోసారి వారికే పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ కు జై కొట్టాలని యోచిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే. రాష్ట్రంలో అధికార వైసీపీ సైలెంట్ గా తన ఓటు బ్యాంకును పెంచుకుంటున్నది. అదే విషయం పలు రహస్య సర్వేల్లోనూ నిర్ధారణ అవుతున్నది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సొంతంగా చేయించు. కున్న పలు సర్వేల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ మరింత పట్టు పెంచుకుంటున్నదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నాయి. గడిచిన మూడు నాలుగు నెలలుగా ఆయా పార్టీల అగ్ర నేతలంతా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శల బాణాలు వదులుతున్నారు. సీఎం జగన్ మాత్రం సైలెంట్ గా ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తూ తన బలాన్ని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు.
*రహస్య సర్వేల్లోనూ.. అవే నివేదికలు*
ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ రాజకీయ పార్టీలు అన్ని సర్వేల జపం చేస్తున్నాయి. అందులో భాగంగా వైసీపీతో పాటు తెలుగుదేశం కూడా సర్వే లు నిర్వహిస్తున్నారు. *పల్లెల్లో.. మరింత బలం*
వైసీపీకి పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలం పెరుగుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో పల్లెలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఎక్కువ శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. అయితే గడిచిన నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పల్లె ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతూ వస్తున్న ది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంతో పోలిస్తే 8 నుంచి 10 శాతం వరకు వైసీపీకి ఓట్ల శాతం పెరిగినట్లు కనిపిస్తుంది. పల్లె ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అత్యధిక శాతం మంది జగన్ ప్రభుత్వం పైనే చర్చించుకోవడం, వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీకే పట్టం కట్టాలని మాట్లాడుకోవడాన్ని చూస్తుంటే పట్టణాలకంటే పల్లెల్లో వైసీపీ తన బలాన్ని మరింత పెంచుకుంటు న్న స్పష్టంగా అర్థమవుతుంది.
ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ బలంతో పాటు ప్రత్యర్థుల బలాబలాలపై రహస్యంగా సర్వేలు చేయిస్తున్నాయి. అందులో వైసీపీ తన బలాన్ని పెంచుకుంటున్నట్లు అన్ని సర్వేల్లోనూ ఆ దిశగానే నివేదికలు అందుతున్నాయి. దీంతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై మరింత
ఎదురుదాడికి దిగుతున్నారు. మరోవైపు యువగళం పాదయాత్రలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర. అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం జగన్ నే టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ మాత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు చేసి వారానికో జిల్లా పర్యటనకు వెళ్తూ ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తూ సైలెంట్ గా తమ బలాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తుంది. సీఎం జగన్ కు అండగా నిలుస్తోంది. రాష్ట్రానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రం రాష్ట్రం విషయంలో సానుకూలంగా ఉంది. నిధులు విడుదల చేయడంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి ప్రాధాన్యతను ఇస్తుంది. సీఎం జగన్ కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలోనూ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నికల లోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అవసరమైన సంక్షేమం, అభివృద్ధి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్ గురి పెట్టారు. ఆ దిశగానే తన బలాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు.
