ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అన్యాయం అని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. దరిశి మండలం బొట్లపాలెం, రాజంపల్లి , చందలూరు అంగన్‌వాడీ కార్యకర్తల సెక్టార్ లలో జరిగిన సమావేశాల్లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ... ఎన్నికలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు 1500 , మీని కార్యకర్తకి 1250 , హెల్పర్ కి 750 రూపాయలు , తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదని , సుప్రీం కోర్టు 1972 చట్టం ప్రకారం అంగన్ వాడీలందరికీ దేశ వ్యాప్తంగా గ్రాట్యూటి ఇవ్వాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. సంఘం ఆందోళనలకు పిలుపు ఇస్తే ముందుగానే పోలీసుల నోటీసులు , అరెస్టులు , ఇంటివద్ద పోలీసులతో కాపలా , మధ్యలోనే నిర్బంధం చేస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. అంగన్‌వాడీ లకు కనీస వేతనం అమలు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు నుంచి తొలగించడంతో రెండు విధాలా నష్ట పోతున్నారని , 60 సంవత్సరాలు దాటిన వారిని రిటైర్మెంట్ చేసి కాలి చేతులతో ఇంటికి పంపుతున్నారని కనీసం ఫించన్ నెలకు 5 వేలు ఇవ్వాలని రిటైర్మెంట్ 5 లక్షలు ఇవ్వాలని ఆయన కోరుచూ జూలై 10,11 తేదీలలో ఒంగోలు కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగే 36 గంటల ధర్నాలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చిందని నియోజకవర్గం లోని అందరూ సెంటర్ లకు తాళాలు వేసి , సెలవులు పెట్టి ఆందోళనలలో పాల్గొవాలని కోరారు.
యూనియన్ నాయకురాలు బాదిరెడ్డి అచ్చమాంబ మాట్లాడుతూ….. అంగన్‌వాడీ స్కూల్ పిల్లలకు అమ్మఒడి అమలు చేయాలని , ఐసిడిఎస్ కి నిధులు పెంచాలని, యూనిఫాం అందించాలని , వేధింపులు అపాలని , వేతనం పెంచాలని , నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, వేతనం తో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలని జరిగే ధర్నా లో పాల్గొవాలని కోరారు…
ఈ సమావేశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు తిరపతమ్మ , జయమ్మ , మేరి ప్రశాంతి కుమారి , సుజాత , పద్మా , బాలమ్మ , నాగమల్లేశవరి , ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
