నాలుగేళ్లకు అంబేద్కర్ కాలనీలోని వాటర్ ప్లాంట్ కు మరమ్మత్తులు -సర్పంచ్ ప్రత్యేక చొరవతో వినియోగంలోకి వాటర్ ప్లాంట్

తాళ్లూరు అంబేద్కర్ కాలనీలో గతనాలుగేళ్లుగా మరమ్మత్తు లకు నోచుకోని వాటర్ ప్లాంట్ ను గ్రామసర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్, జిల్లా మాలమహానాడు అధ్యక్షులు దారా అంజయ్యల చొరవతో నిధులు సమకూర్చి మరమ్మత్తులు జరిపించి వినియోగంలోకి తీసుక వచ్చారు. శుక్రవారం వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకుని వచ్చారు. అంబేద్కర్ కాలనీలో గత నాలుగే ళ్లుగా వాటర్ ప్లాంట్ మరమ్మత్తులకు నోచుకోలేదు. గ్రామవాసి జిల్లామాలమహా నాడు అధ్యక్షులుదారా అంజయ్య నేతృత్వంలోని కాలనీ వాసులు అనేక మార్లు అధికారులను కలిసి ఎస్సీలపట్ల చిన్నచూపువిడనాడి …వాటర్ ప్లాంట్ వినియోగంలోకి తీసుక రావాలని విన్నవించినా అధికార యంత్రాంగం స్పందించిన దాఖాలులేవు. దీంతో గ్రామసర్పంచ్ చార్లెస్ సర్జన్ ను, అంజయ్య సంప్రదించి ఎస్సీకాలనీ వాసుల నీటి సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. గ్రామపంచాయతీ నందు నిధుల కొరత
గా తీవ్రంగా వున్నా కాలని వాసులు పడుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు రూ50వేల నిధులు అందజేశారు. దారాఅంజయ్య మరో రూ20వేలు సమకూర్చి రూ.70 వేలు వెచ్చించి డీప్ బోరు, ఫిల్టర్స్ కు మరమ్మత్తులు జరిపించారు. ప్లాంట్ ను ప్రారం భించి వినియోగంలోకి తేవటంతో గత నాలుగేళ్లుగా కాలనీవాసులు ఎదుర్కోంటున్న
మంచినీటి సమస్య పరిష్కరించి నట్లయిందని కాలనీవాసులు అంటున్నారు. కార్యక్ర మంలో ఎంపీటీసీ యామర్తి ప్రభుదాసు, గ్రామ కార్యదర్శి జె.లక్ష్మీకాంత్, వార్డు సభ్యులు బంటుపల్లి మోహన్ రావు, పులుగు చిరంజీవి, బి.భాగ్యం, పి. శాయమ్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *