రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్టిజికెయుటి) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాల్లో భాగంగా జులై 5 నుంచి తొమ్మిదో తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు ఆర్టికెయుటి ఛాన్సలర్ కె.సి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 38,490 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్ పెట్టుకున్న విద్యార్థులు తమ మార్కులు పెరిగితే వచ్చే నెల ఐదో తేదీ లోగా నోటిఫికేషన్ ఇచ్చిన వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. అలా పొందుపరిచిన మార్కుల జాబితాల ఆధారంగా వారి దరఖాస్తులో మార్కుల వివరాలను సవరిస్తామని తెలిపారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన క్యాప్, ఎన్స్సి, స్పోర్ట్స్, పిహెచ్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్ను ఈనెల 30వ తేదీన యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
5 నుంచి ప్రత్యేక కేటగిరీధ్రువపత్రాల పరిశీలన
01
Jul