రాష్ట్రంలో ప్రతి సమస్యను పరిష్కరించడమే సీఎం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ పేర్కొన్నారు. దర్శి పట్టణంలోని ఒకటో సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నిర్వహించారు. 11 రకాల ఉచిత సేవలను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మధు శెట్టి వేణుగోపాల్ మాట్లా డుతూ …ఆధార్ లింక్ , రేషన్ కార్డు వంటి వాటిలో పలు లోపా లతో రావాల్సిన పథకాలు రానివారికి వాటిని సవరణ చేసి ఉచితంగా అందించడమే జగనన్న సురక్ష లక్ష్యం అని అన్నారు. పథకాలకు అర్హులైనప్పటికీ సాంకేతిక లోపాల వల్ల పథకాలు వర్తించని వారి వివరాలు వలంటీర్లు, గృహసార థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల మొత్తం ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, మండల కన్వీనర్ వెన్న పూస వెంకటరెడ్డి, నగరపంచాయతీ కమీషనర్ మహేశ్వరరావు, సచివాలయాల కన్వీనర్ కోటిరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, డీఈ రఫి, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు తాళ్లూరి బాబురావు, వీసీరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నా రెడ్డి, ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, సర్పంచ్ అంకాల శ్రీను, వైఎస్సార్ సీపీ నాయకులు కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, నారాయణ రెడ్డి, కోరె సుబ్బారావు, పుట్ట రవి, మిల్లర్ బుజ్జి పాల్గొన్నారు.
వెంకటాచలం పల్లి గ్రామంలో ….
ప్రజల వద్దకే పాలన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి మండలంలోని వెంకటాచలం పల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ శనివారం హాజ రయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాఅచ్చయ్య, సచివాల యాల మండల కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సర్పంచ్ అంకాల శ్రీను, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఈఓఆర్డీ శోభన్ బాబు మండల ప్రత్యేకాధికారి రవికుమార్ పాల్గొన్నారు.


