రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానులు నష్టపోకుండా పంట సాగు దారుల చట్టం -2019 చట్టం ద్వారా వారికి ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే లాగున సహకరించాలని తాళ్లూరు గ్రామ ఎం పీ టీ సీ-2 సభ్యుడు యామర్తి ప్రభుదాసు తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపన బోయిన వెంకటరావు అధ్యక్షతన తాళ్లూరు అంబేద్కర్ నగర్ లో ఎస్సీ ఎస్టీ కౌలు రైతులకు పంట సాగు దారుల చట్టంపై ప్రచార ఉద్యమం కార్యక్రమంలో ఆయన రైతులకు తెలియజేశారు. డిబిఆర్సి రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న భూముల ద్వారా రైతు భరోసా కేంద్రంలో గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు సహకారంతో పంట సాగు ధ్రువీకరణ పత్రాలు(CCRC) తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నగదు, పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణాలు పొందటానికి కౌలు రైతులకు ఎక్కువ అవకాశం ఉన్నందున ప్రతి కౌలు రైతు పంట సాగు ధృవీకరణ పత్రాలు పొందాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య మాట్లాడుతూ భూ యజమానులు ఎస్సీ ఎస్టీ కౌలు రైతులకు సహకరించి వారి యొక్క వ్యవసాయ అభివృద్ధి కొరకు తప్పనిసరిగా వారి యొక్క భూమి యొక్క రికార్డులను ఇచ్చి పంట సాగు ధ్రువీకరణ పత్రాలు(CCRC) పొందుటకు సహకరించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయిలోని ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు పాల్గొన్నారు.
భూ యజమానులు ఎస్ సి,ఎస్ టి కౌలు రైతులకు సహకరించాలి
01
Jul