కౌలు రైతులు అన్ని పథకాలకు అర్హులు

కౌలు గుర్తింపు కార్డులు పొందిన రైతులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలకు అర్హులవుతారని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, డీపీఓ జీవీ నారాయణరెడ్డి తెలిపారు. తాళ్లూరు-1 రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో సీసీఆర్సీపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ…. కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందిన రైతులు పొలం యజమాని ప్రభుత్వం నుంచి ప్రయోజనాలన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సమయంలో పంటనష్టం వాటిల్లితే నష్టపరిహారం అందుతుందని తెలిపారు. జడ్పీటీసీ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీసీఆర్సి కార్డుతో బ్యాంకులో పంట రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ప్రతి కౌలు రైతు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. డీపీఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ ..కౌలు రైతులు గుర్తింపు కార్డులతో పంట నమోదు చేసుకుంటే వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, విపత్కర పరిస్థితుల్లో పరిహారం పొందవచ్చని అన్నారు. ఏవో బి.ప్రసాదరావు మాట్లాడుతూ… కౌలు రైతులు కార్డులను అందుకున్న వెంటనే ఈ ఏడాది సాగు చేస్తున్న పంట వివరాలను, ఈ క్రాప్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ మేకల చార్లస్ సర్జన్, ఈవోపీఆర్డీ కేజీఎస్ రాజు, కోఆప్షన్ సభ్యులు కరిముల్లా, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాసు, వీఏఏ నాగరాజు, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *