నాటా అవార్డ్ ఇన్ జర్నలిజం ఎక్సలెన్సి అందుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని

2023 నాటా అవార్డ్ ఇన్ జర్నలిజం ఎక్సలెన్సి” ని సీనియర్ జర్నలిస్టు, ఆంధ్ర ప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు శనివారం అందుకున్నారు. అమెరికా లోని డల్లాస్ లో జరిగిన కార్యక్రమంలో జర్నలిజం రంగంలో ఆయన 46 ఏళ్ల విశేష ప్రతిభను గుర్తించి ఈ అవార్డును కొమ్మినేనికి ఉత్తర అమెరికా తెలుగు సమితి ( నాటా) ప్రదానం చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో ఏటా జరిగే తెలుగు ప్రజల ఉత్సవాలను ఈ ఏడాది (2023) అమెరికా లోని డల్లాస్ లోని “డల్లాస్ కన్వెన్షన్ సెంటర్”లో జూన్ 30 నుంచి జులై 2 వరకు నిర్వహిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

1956 లో కృష్ణా జిల్లా గన్నవరం లో జన్మించిన కొమ్మినేని శ్రీనివాస రావు ఎం.కామ్. వరకు చదువుకున్నారు. 1978 లో ఈనాడు దిన పత్రికతో జర్నలిజం రంగంలో ప్రవేశించారు. 2002 వరకు విజయవాడ, తిరుపతి, హైదరాబాదు, న్యూ ఢిల్లీ లలో అదే పత్రికలో వివిధ హెూదాల్లో పనిచేశారు. 2002 నుంచి 2007 వరకు ఆంధ్ర జ్యోతి దిన పత్రిక బ్యూరో చీఫ్ గా హైదరాబాదు లో పనిచేసారు. 2007 నుంచి 2023 వరకు ఎన్.టి.వి కి చీఫ్ ఎడిటర్ గా, టీవీ 5 లో ఎడిటర్ గా, సాక్షి టీవీ లో కన్సల్టింగ్ ఎడిటర్ పనిచేశారు. ఒకే పేరుతో, “కె.ఎస్.ఆర్. లైవ్ షో” అనే పేరుతో ఎన్.టి.వి, సాక్షి టీవీ ల్లో 14 సంవత్సరాల పాటు ‘లైవ్ షో’ ను నిర్వహించడం వారి ప్రత్యేకత కాగా, సాక్షి టీవీ లో రెండేళ్ల పాటు ఒక్క రోజు కూడా విరామం లేకుండా ‘లైవ్ షో’ ను నిర్వహించడం మరో ప్రత్యేకత. ఈనాడు, ఆంధ్ర జ్యోతి, సాక్షి, ఆంధ్ర ప్రభ, సూర్య, గ్రేట్ ఆంధ్ర
దిన పత్రికల్లో వేల సంఖ్య లో సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు ప్రచురించ బడ్డాయి. “కె.ఎస్.ఆర్. కామెంట్” పేరుతొ సామాజిక, రాజకీయ అంశాలపై ప్రతి రోజూ సాక్షి టీవీ, యూట్యూబ్ ఛానల్ ల్లో కామెంట్లు కొనసాగిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజా తీర్పు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యుల, పార్లమెంట్ సభ్యుల సామాజిక విశ్లేషణ, శాసన సభ చర్చల సరళి (మూడు సంపుటాలు), ప్రాంతీయ ఉద్యమాలు పదవీ రాజకీయాలు, రాజకీయ చదరంగం లో ఆంధ్ర ప్రదేశ్ – ఆంధ్ర నేతల చారిత్రక తప్పిదం, ఆంధ్ర ప్రజా తీర్పు 1952-2014, తెలంగాణ ప్రజా తీర్పు 1952-2014, తెలంగాణ రాష్ట్ర – పాత్ర ధారులు, రాష్ట్రం లో రాజకీయం, ఈనాడు దిన పత్రికలో ప్రచురితమైన వ్యాసాల సంకలనం, ఆంధ్రా టు అమెరికా, తాజా కలం ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో ప్రచురితమైన వ్యాసాల సంకలనం, సంభాషణ చతురుడు రోశయ్య వంటివి వారి ముఖ్యమైన రచనలని కొమ్మినేని గురించి ఆ పురస్కార సభలో సభికులకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *