దర్శి మండలంలో కంది సాగు చేసిన రైతులకు పంటల భీమా నగదు మంజూరు అయినట్లు వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు . మండలం లో కంది రైతులు 2836 మందికి 3,40,84,768/- రూపాయిలు పంటల బీమా నగదు మంజూరు అయినదని తెలిపారు.
దర్శి మండలంలో ఖరీఫ్ 2022 సీజనులో సజ్జ, మిరప, ప్రత్తి పంటలు సాగు చేశారు. వరి, కంది, వేసిన ప్రతి పంటకు సంబంధించి ఈ -క్రావ్ నమోదు చెయ్యడం జరిగింది. ఈ పంటలన్నిటికి పంట కోత ప్రయోగాలు చెయ్యడం జరిగింది. ప్రయోగాలు చేయు సమయంలో భీమా కంపేనీ సంబంధించిన ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొనడం జరిగింది. కోత ప్రయోగాలలో కంది పంటకు దిగుబడి చాల తక్కువగా రావడం జరిగింది . మిగతా పంటలలో దిగుబడి అనేది సహజంగా రావడం జరిగింది. కావున ప్రభుత్వం కంది పంట సాగు చేసిన రైతులకు భీమా ఇవ్వడం జరుగుతుంది. దర్శి మండలంలో 2836 మందికి 3,40,84,768/- రూపాయిలు వచ్చినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు.
కంది రైతులు 2836 మందికి 3,40,84,768/- రూపాయిలు పంటల బీమా మంజూరు
02
Jul