నాగంబొట్లపాలెం సహకార సంఘాల మాజీ సెక్రటరీ ఇండ్లా బాలయ్య మృతదేహాన్ని దర్శిమాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం సందర్శించి నివాళులు అర్పించారు. మాజీసెక్రటరీ బాలయ్య అనారో గ్యంతో మృతి చెందాడు. సొసైటీ సెక్రటరీగా వుండటంతో పాటు తమకుటుంబానికి బాలయ్య అత్యంత సన్నిహితునిగా వున్నాడని, బాలయ్య మరణంతీరనిలోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుబూతిని బూచేపల్లి తెలిపారు. బాలయ్యమృతదేహాన్ని గ్రామ ఉపసర్పంచ్ పులి ప్రసాదరెడ్డి, మాధవస్వామి దేవస్థాన చైర్మన్ పులి అం జిరెడ్డి, ఎమ్.బ్రహ్మారెడ్డి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.
