తూర్పు గంగవరంలో మరమ్మత్తుల పేరిట రోజుకు 7గంటలకు పైగా విద్యుత్తు కోత ఉక్కపోతతో తల్లడిల్లుతున్న ప్రజలు -పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యుత్తు అధికారులు

ప్రధాన వ్యాపారకేంద్రమైన తూర్పు గంగవరంలో గల నెలన్నర రోజులుగా నిత్యంమరమ్మత్తుల పేరిటరోజులో 7గంటలపాటు అనధికారిక విద్యుత్తు కోత విధిస్తుండటంతో గ్రామస్తులు ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. ఉదయం వేళ ఎండ తీవ్రత అధికంగా వున్న సమయంలో రిపేర్లంటూ విద్యుత్తుశాఖ విద్యుత్తుకు కోత విధిస్తున్నారు. దీంతో గృహాల్లో ఉక్కపోత తట్టుకోలేక పోతున్నారు. గ్రామంలో నిత్యంకోతవల్ల పడుతున్నఇబ్బందుల గురించి విద్యుత్తు అధికారులకు వివరించినా ఏదో ఒక సమాధానం చెబుతూ దాట వేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యుత్తు కోత గురించి విద్యుత్తు ఏఈని అడిగేందుకు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తి సమాధానం కూడా ఇవ్వటం లేదని అంటున్నారు.
రామభద్రాపురం వెళ్లే మార్గంలో ట్రాన్స్ఫాఫార్మేర్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఉదయం 9.30 నుండి మద్యాహ్నం 2.30 వరకు విద్యుత్తు కోతవేశారని, మరళా మద్యాహ్నం 3గంటల నుండి రాత్రి 6గంటలకు విద్యుత్తు కోత వేశారని గ్రామస్తులు అంటున్నారు. నిత్యం గంటల కొద్ది విద్యుత్తు అధికారులు తమ ఇష్టాను సారం మరమ్మత్తుల పేరిట విద్యుత్తుకు కోత విధిస్తే ప్రజలవిద్యుత్తు కష్టాలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైనా అధికార యంత్రాంగం స్పందించి తూర్పు గంగవరంలో విద్యుత్తుకోత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *