తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమ్మేళనం నిర్వహిం చారు. 1994-95 విద్యా సంవత్సరంలో పదోతరగతి విద్యనభ్యసించిన వీరంతా పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. స్నేహితులను కలుపుకోవడానికి ఎంతో ఉత్సాహంతో గ్రామానికి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న నాటి గురువులు ఎస్. అంజిరెడ్డి, రమణయ్య, వి. ఆంజనేయులు తదితరులను ఘనంగా సత్కరించారు. తదుపరి అంతా కలిసి ఒంగోలులోని ఓ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. ఒకరినొకరు యోగక్షేమాలు గురించి తెలుసుకొన్నారు. భవి ష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తగు సాయం అందించాలని నిర్ణయిం చారు. పి.బజారు రెడ్డి, ఎం. వెంకటేశ్వరరెడ్డి, కె. వెంకట రావు, నాగమల్లీశ్వరి, పద్మ, వీరనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

