తాళ్లూరు మండలం లో ఘనంగా గురుపూర్ణమి వేడుకలు

గురుపూర్ణమి సందర్బముగా సోమవారం మండలంలోని కొత్త పాలెం, నాగంబొట్లపాలెం సాయిబాబా ఆలయాలవద్ద ఘనంగా వేడుకలు నిర్వహిం చారు. తాళ్లూరు మండలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కొత్తపాలెం గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద సాయిమందిర కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు పూజల్లో పాల్గొని బాబాకుహరతి పూజలు జరిపారు. సాయినాధుకి కాగడహరతి, అభిషేకం, సుప్రభాతము, ఉచిత సామూహిక స్నాతులు, సత్యంగములు,మద్యాహ్నహరతినిర్వహించారు. సాయినాధుని దర్శనం కోసంభక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మండలంలోని పలుగ్రామాలనుండి భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుని పూజలు జరిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, శ్రీసరస్వతీవిద్యాసంస్థల అధినేత ఏవిరమణారెడ్డి అధికసంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *