జగనన్న సురక్షలో 199 పత్రాలు అందజేత

తాళ్లూరు మండలంలోని శివరాంపురం, మల్కాపురం గ్రామ సచివాలయాల వద్ద సోమవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో 11 రకాల సేవలు 199 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ప్రజలకు జగనన్న సురక్ష వల్లజరిగే ప్రయోజనాలను వివరించారు. మల్కాపురంనందు 92, శివరాంపురం నం దు107సర్టిఫికేట్లు అందజేశారు. ఆయాకార్యక్రమాల్లో తహసీల్దార్ కెవిప్రసాద్, ఈఓ ఆర్ డి కెజిఎస్ రాజు, సర్పంచ్ షేక్ కాలేషావలి, ఎంపీటీసీ మేడగం వెంకట్రామి రెడ్డి, నిశ్శంకం హనుమంత రావు, సూపర్నెంట్ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీను, పంచాయతీ కార్యదర్శులు జె.లక్ష్మీకాంత్, పవన్ కుమార్, విఆర్వోలు నాగేశ్వర రావు, నారపురెడ్డి, సచివాలయసిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *