బాధితులకు న్యాయం చేసేందుకే దర్శి నియోజకవర్గంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీలు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్రమపద్ధతిలో వారి అర్జీలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి స్పందన వలన ఒంగోలుకు దూరప్రాంతంలో ఉండే మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, గిద్దలూరు వంటి నియోజకవర్గాల వారికి రావాల్సిన పనిలేకుండా ఇక్కడే సమస్యలు పరిష్క రించేందుకు మంచి అవకాశం అన్నారు. 372 ఆర్జీలు వచ్చాయని, గత సంవత్సరం ఇచ్చిన అర్జీలే 40పైగా వచ్చాయని చెప్పారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో భూ సమ
స్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తాత్కాలికంగా పనులు చేయడం కాకుండా 100 శాతం పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించి అర్జీదారులను సంతోష పెట్టేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఎంపీడీఓ, తహశీల్దార్, పోలీస్ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మండల స్థాయిలో అధికారులు టీంలా వెళ్లి రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. అర్జీలపై సక్రమంగా పనిచేశారా లేదా అని మరొక ఆడిట్ టీంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో వారు సరిగా పని చేయక బాధితుడు సం తృప్తి చెందకపోతే రీ ఓపెన్ చేసి, 1902 కు చెప్పవచ్చ న్నారు. ఆ తరువాత కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు స్వయంగా పరిశీలించి న్యాయం చేస్తారన్నారు.
*ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్* మాట్లాడుతూ…
గత సంవత్సరం దర్శిలో జిల్లా స్థాయి స్పందనకు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. వచ్చిన అర్జీలు చక్కగా పరిష్కరించారని, అందుకే మళ్లీ దర్శిలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాకు వచ్చిన అధికారులు, కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ శ్రీని వాసరావు, డీపీఓ నారాయణరెడ్డి, ఆర్డీఓలు విశ్వేశ్వర రావు, అజయ్ కుమార్, డ్వామా పీడీ శీనారెడ్డి, డీఆ ర్ డీఏ పీడీ బాబురావు, హౌసింగ్ పీడీ పేరయ్య, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, గ్రౌండ్ వాటర్ డిడి విద్యాసాగర్, ఆర్ డబ్ల్యూఎస్ఈ మర్ధన్ లీ, మెప్మా పీడీ రవికుమార్, ఎస్ఈ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఈహెచ్ గోపీచంద్, ఏపీఎంఐపీ పీవీ రమణ, డిజైబుల్ ఏడీ అర్చన, ఉపరవాణా శాఖ కమిషనర్ ఆర్ సుశీల, యానిమల్ హజ్బెండరీ జేడీ బేబిరాణి, బీసీ వెల్ఫేర్ డీడీ అంజలాదేవి, ఆత్మపీడీ అన్నపూర్ణ, విద్యుత్ డీఈ రఫి తహశీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.




