గురుపౌర్ణమి సందర్భంగా జెడ్పి చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు దర్శిలోని ఎన్ఏపి చెరువు సమీపంలో గల సాయిబాబా ఆలయంలోనూ, దర్శిలోని సాయి ధ్యానమందిరంలోనూ, సాయి పథం లోనూ శ్రీ షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. బూచేపల్లిని ఆయా ఆలయాల నిర్వాహకులు సత్కరించారు. ఆయన వెంట స్థానిక నాయకులు పలువురు పాల్గొన్నారు.



