ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించి దృవీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం జగన్న సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఎంపీపీ ఎం. ఎన్.పి నాగార్జున రెడ్డి తెలిపారు. మన్నేపల్లి పంచాయితీలలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈఓ ఆర్డీ కెజీఎస్ రాజు మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం: ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా నేరుగా ఎటువంటి ఆలస్యం లేకుండా 11 రకాల సర్టిఫికేట్స్ను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుందని అన్నారు. 80 మందికి అవసమైన పలు పత్రాలను వైస్ ఎంపీపీ మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి, సర్పంచి మంచాల నాగార్జున రెడ్డిలు పంపిణీ చేసారు.
