తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో దివంగత నేత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో అడ్మిస్ట్రేటివ్ అధికారి వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎం.పి.పి తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు మాట్లాడుతూ …బడుగు బలహీన వర్గాల కోసం బాబూజగ్జీవన్ రామ్ అవిరళ కృషి చేశారని, అట్టడుగుజాతిలో జ న్మించి, మేధస్సుతో దేశ చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచారని కొనియాడారు. అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సుకోసం ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తని తెలిపారు. విద్యతో ఉన్నతస్థానంలో నిలిచి దేశ ఉపప్రధానిగా దేశాభివృద్ధికి బాటలు వేశారని ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ ఎడమ కంటి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ లు మేకల చార్లెస్ సర్జన్, కాలేషా వలి, పి. ఏస్ . శ్రీకాంత్ రెడ్డి, ఎం.పి.టి. సి. జి. ఎస్. ప్రభాకర రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జె.లక్ష్మీకాంత్, రిటైర్డ్ ఉపాధ్యాయులు కాసా గోపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం లో ఘనంగా జగ్జీవన్ రామ్ వర్థంతి వేడుకలు
06
Jul