తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామంలో ఎంపీపీఎస్ స్కూల్ ప్రహరీగోడ మిగులు నిధుల బిల్లుల చెల్లింపుపై ఈ ఓఆర్ కెజిఎస్ రాజు విఠలాపురం సచివా లయంలో గురువారం విచారణ చేపట్టారు. ఎంపీపీఎస్ స్కూల్ ప్రహరీగోడ మిగులు నిధుల చెల్లింపులు పంచాయతీకి జమైనా చెల్లింపులు జరగలేదని పని నిర్వహ కుడు నవులూరివిద్యాసాగర్ ఫిర్యాదు మేరకు డిపీవో జి.వి నారాయణరెడ్డి విచారణకు ఆదేశించారు. దీంతో ఈఓఆర్డీ కెజిఎస్ రాజు విఠలాపురం సచివాలయలో విచారణ చేప ట్టారు. ఫిర్యాధి విద్యాసాగర్ వద్ద నుండి వివరాలు సేకరించారు. 2018-19 వసం త్సరం ఎమ్.ఎన్. ఆర్.ఈ.జి.ఎస్ పధకం కింద వర్క్ ఐడి నంబర్ 08774150400315001న ప్రాధమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి రూ 8లక్షల 75 వేలు మంజూరయ్యాయని, ఆపనులు తాలూకు మొదటి బిల్లుగా రూ3,02,010లు ఏప్రిల్ 2019లో అప్పటి ప్రత్యేకాధికారి చెల్లించారని తెలిపారు. మిగిలినబిల్లురూ4,88,904లందు ప్రభుత్వంప్రత్యేకాధికారి చెల్లించారని తెలిపారు. మిగిలినబిల్లు రూ4,88,904లందు ప్రభుత్వం 20శాతం మినహాయించి మిగులు బిల్లురూ3,86,136లు గ్రామ పంచాయతీకి జమచే శారని తెలిపారు. తాళ్లూరు కెనరాబ్యాంక్ వద్దకు వెళ్లి అడుగగా విఠలాపురం పంచా యతీ అకౌంట్ తమ బ్యాంక్లో లో లేదని చెప్పటంతో ఒంగోలులోని సర్వశిక్ష అభియాన్అధికారుల వద్దవెళ్లి అడుగగా విఠలాపురం పంచాయతీ అకౌంట్ ఒంగోలు ఇండియన్ బ్యాంక్ నందు ఉన్నందున జమచేయటం జరిగిందని తెలిపారన్నారు. గ్రామ కార్యదర్శిని బిల్లుల చెల్లింపు గురించి అడుగగా ఒంగోలు సింగిల్అకౌంటు మాత్రమే వున్నదని మిగులు బిల్లుల విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారని తెలి పారు. ఒంగోలు ఇండియన్ బ్యాంక్ నందు విచారించుకోగా 7జూలై 2022న జమకాగా గ్రామసర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి జూలై 15న డ్రాచేసినట్లు తెలిసిందని తెలి పారు.అందుకు సంబందిత పనుల తాలూకుతన వద్ద వున్న పూర్తి రికార్డును, లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్ను ఈఓఆర్డీ కెజిఎస్ రాజుకు విద్యాసాగర్ అందజేశారు. ఈవిచారణలో గ్రామ కార్యదర్శిపివిఎన్ పవన్ కుమార్ వున్నారు.
ప్రహరిగోడ మిగులు నిధులు బిల్లుల చెల్లింపులపై ఈఓఆర్డి విచారణ
06
Jul