వైసీపీ నాయకులు గంగిరెడ్డిపాలెం యల్లమందారెడ్డి జన్మదిన వేడుకలు గురువారం తాళ్లూరు మండల వైసీపీ ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర నివాసంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మద్దిశెట్టి రవీంద్ర ఆయనకు జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు. తదనంతరం తాళ్లూరు మండల జడ్పిటిసి మారం వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పి సుమలత శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ విసీ రెడ్డి తదితరులు యల్లమందారెడ్డికి జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు.

