ట్రాక్టర్ ట్రాలీ క్రింద పడి బాలుడు మృతి – తోటి స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ జారి’ ట్రాక్టర్ ట్రాలీ వెనక వైపు పడి మృతి – విషాదంలో తల్లిదండ్రులు, బంధువులు

తోటి స్నేహితుడితో కలసి హుసారుగా సైకిల్ పై వెళ్తూ ప్రమాదశాత్తు ట్రాక్టర్ ట్రాలీ క్రింద పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్నది. ఈ ఘటన తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో చోటు చేసుకున్నది. వివరాలలోనికి వెలితే తూర్పు గంగవరంలో పరమార్ రోహిత్ సింగ్ (11) అను బాలుడు తోటి స్నేహితుడితో కలసి పాఠశాల వదిలి వేసిన తర్వాత సైకిల్ పై ప్రధాన వీధిలో వెళ్తున్నాడు. అంతకు ముందుగా కంకర లోడ్ తో కూడిన ట్రాక్టర్ వెళ్తున్నది. అయితే ఆట్రాక్టర్ ను క్రాస్ చేస్తూ ఒకరికి ప్రక్కన ఒకకు వెళ్తూ ఒక్కసారిగా రోహిత్ క్రింద పడి పోయాడు. అదే సమయంలో ట్రాక్టర్ ట్రాలీ టైర్ ఎక్కటంతో అక్కడిక్కడే తల నుజ్జు నుజ్జుగా మారినది. అదే సమయంలో గమనించిన స్థానికులు నిశ్చేష్టులైనారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ప్రేమకుమార్, ఎఎస్పైమోహన్ రావు లు పరిశీలించారు.
తీవ్ర విషాదంలో కుటుంబం …
రాజస్థాన్ కి చెందిన పరమార్ లక్ష్మన్, అనిత దంపతులు మూడు దశాబ్దాల క్రితం తాళ్లూరు మండలంకు వచ్చి స్థిర పడ్డారు. తూర్పుగంగవరంలో లక్ష్మణ్ సెల్ షాప్ మంచి పేరు సంపాదించారు. రోహిత్, కోమల్ ఇరువురు సంతానం కాగా మృతుడు రెండవ కుమారుడు రోహిత్ .. కళ్ల ఎదుటే హుసారుగా తిరుగుతూ ఒక్కసారిగా ప్రమాదంలో మృతి చెందటంతో నిత్యం రద్దీగా ఉండే తూర్పు గంగవరంలో వ్యాపారులు గుమికూడారు. తల్లిదండ్రులు ఆర్తనాదాలు మిన్నంటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *