ముండ్లమూరు మండల పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గా యు వి కృష్ణయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఒంగోలు ఒకటో పట్టణం నుండి ఇక్కడికి బదిలీ కాగా, ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై ఎల్. సంపత్ కుమార్ ఒంగోలు వీఆర్ కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై యువి కృష్ణయ్య మాట్లాడుతూ… మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసులు నూతన ఎస్సైకి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముండ్లమూరు ఎస్సైగా యువి కృష్ణయ్య బాధ్యతలు స్వీకరణ
08
Jul