వైఎస్సార్ జయంతి వేడుకలు శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు మండలంలో వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర ముఖ్య అతిథిగా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. వెల్లంపల్లి రోడ్ లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిథులు పూల మాలు వేసి నివాళులు అర్పించారు. కేకు కట్చేసి పంచి పెట్టారు. స్వీట్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, సుబ్బారావు, పిఎస్ శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, ఎంపీటీసీ బాలకోటయ్య మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, పార్టీ కార్యదర్శి యాడిక ఎలమందరెడ్డి , మాజీ మాధవ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ పులి బ్రహ్మ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ లు ఆంజనేయులు, శ్రీనివాసరావు , దేవదానం, ఎలమందరావు , జేసిఎస్ కెవి పాలెం కన్వీనర్ విష్ణు చందన , సుంకి రెడ్డి పాలెం లో మాజీ సర్పంచ్ ఎడమకంటి పెద్దిరెడ్డి దంపతులు ,మాజీ సర్పంచిలు, ఎంపీటీసీలు , తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలు పంచాయితీలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.



