పేదవాడి గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వక్తలు అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు శనివారం బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో గుంటి గంగలోని తేజ వయో వృద్ధాశ్రమంలో నిర్వహించారు. వృద్ధులకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేసారు. వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధనరెడ్డి, దోసకాయలపాడు సర్పంచి కెఎస్ వెంకట రామిరెడ్డి, తాళ్లూరు 2 ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, మాజీ సోసైటీ అధ్యక్షుడు తూము పెద్ది రెడ్డి, వైసీపీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామ క్రిష్ణ, సొసైటీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొండా రెడ్డి, తిరుపతి రెడ్డి, వార్డు మెంబర్ నాగేశ్వరరావు, శ్రీనివాస్ వర్మ, కొండలు తదితరులు పాల్గొన్నారు.

