వై.యస్.ఆర్ రైతు దినోత్సవం నిర్వహణ -డా|| వై.యస్.ఆర్ ఉచిత పంటల భీమా రైతులకు వరం

2022 ఖరీఫ్ లో పంటలు సరిగా వండక నష్టపోయిన రైతన్నలకు, వరుసగా నాలుగో ఏడాది. డా॥ వైయస్ఆర్ ఉచిత పంటల భీమా పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తాళ్లూరు మండల వైసీపీ ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్ద డాక్టర్ వైయస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహించారు. తాళ్లూరు
మండలం లో వాతావరణ ఆధారితంగా నోటిఫై కాబడిన ప్రత్తి పంట రైతులు 63 మందికి 129.14ఎకరా లకు గాను, రూ 18, 72,561/- లు మరియు దిగుబడి ఆధారితంగా నోటిఫై కాబడిన కంది రైతులు 724 మందికి 1444.31 ఎకరాలకుగాను రూ 1,42,93,807/30, మరియు సఖ్న రైతులు 675 మందికి 1128 ఎకరాలకు రూ.19,82, 409/- లు కాగా మండలం మొత్తంమీద 1462 రైతులకు 2701 ఎకరాలకు
రూ .1,81, 48,777/-లు మన ముఖ్యమంత్రి విధుదల చేయనున్నారని తెలిపారు.
సదరు నగదు వారివారి ఖాతాలలో జమ అవుతుందని మండం వ్యవసాయాధి కారి ప్రసాదరావు తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, సుబ్బారావు, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, పార్టీ కార్యదర్శి యాడిక ఎలమందరెడ్డి , మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ లు ఆంజనేయులు, శ్రీనివాసరావు , చందన మాజీ సర్పంచిలు, ఎంపీటీసీలు , తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *