ముండ్లమూరు మండలంలోని వేముల రైతు భరోసా కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఏఏ వి.నిర్మల మాట్లాడుతూ …రైతులకు ప్రభుత్వం ఆర్ బి కే లా ద్వారా వ్యవసాయ పనిముట్లు, ఉచితంగా విత్తనాలు, రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. పండించిన పంటలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం తోపాటు, పంట నష్టపరిహారం అందిస్తుందన్నారు. ప్రతి ఒక్క రైతు తమ పంటల వివరాలను ఈ క్రాఫ్ లో నమోదు చేసుకున్న వారికే పంటల నష్టపోయిన సమయంలో పంట నష్ట పరిహారం అందుతుందన్నారు. రైతులు ఇలాంటి సదుపాయాలను ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బచ్చు ఏడుకొండలు రెడ్డి, గజ్జల కొండ గురువారెడ్డి, కుమ్మిత కుమారి, గజ్జల సుబ్బులు, వాలంటీర్ అరుణ, ఐ సి ఆర్ టి కాశమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ముండ్లమూరు మండలంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
09
Jul