రైతులకు మెరుగైన సేవలు -వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -రూ.1.70 కోట్ల పంటల బీమా చెక్కులు అందజేత

రైతులకు మెరుగైన సేవలు అందిం చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. రూ.1.06 కోట్లతో సంతనూతలపాడు ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నూత నంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను వైఎస్సార్ జయంతి సంద ర్భంగా జేసీ శ్రీనివాసులుతో కలిసి శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… పంటల సాగులో వినియోగించే విత్తనాలు, పురుగుమందుల నాణ్యతను తెలుసుకునేందుకు అగ్రిటెస్టింగ్ ల్యాబ్ దోహదపడుతుందని తెలిపారు. అనంతరం సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలోని రైతులకు పంటల బీమా ద్వారా ప్రభుతం మంజూరు చేసిన రూ.1.70 కోట్ల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. నాణ్య మైన కందులకు సంబంధించిన మినీ కిట్లను రైతులకు ఉచితంగా అందించారు. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్య క్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీని వాసరావు, డీడీఏ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎంపీపీ బీ విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ, వైఎస్సార్ సీపీ మండల కన్వీ నర్ దుంపా చెంచిరెడ్డి, సంతనూతలపాడు సర్పంచ్ దర్శి నాగమణి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, సొసైటీ ప్రెసిడెంట్లు దుంపా యలమందారెడ్డి, బీ శివరామయ్య, అలీ సాహెబ్, ఏడీఏ రమేష్ బాబు, నాలుగు మండలాలవ్యవసాయాధికారులు, సర్పం చ్ లు, వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *