ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో ఆదివారం శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవాలయంలో ఆషాడ మాసం పర్వదినాన శ్రీ జ్వాలాముఖి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ జ్వాలాముఖి అమ్మవారికి ముందుగా గణపతి పూజ, మండపారాధన , పంచామృత అభిషేకం , సామూహిక కుంకుమార్చన, హోమం మహిళలు , పూజారుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది.అనంతరం భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం జ్వాలాముఖి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మేళ తాళాలతో, భక్తుల నడుమ గ్రామోత్సవం జరిగింది. అనంతరం రాత్రికి భజనా కార్యక్రమం జరిగింది. కార్యక్రమం పూజారులు ఉద్దండం రమణయ్య , నుదురుపాటి వెంకట కృష్ణారావు, కొండూరి ఉమా గౌరీ శంకర శాస్త్రి, సోమంచి భాస్కర అవధాని శర్మ , కోటా సుబ్రహ్మణ్యం శర్మ గార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.





