దర్శి నియోజక వర్గంలో మూడు రహదారుల అభివృద్ధికి రూ. 16.90 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రభత్వం జీఓ జారీ చేసినది. దర్శి – దొనకొండ రోడ్డు అభివృద్ధికి రూ. 3.10 కోట్లు, తూర్పు గంగవరం – తాళ్లూరు రోడ్డు అభివృద్ధికి రూ. 4.80 కోట్లు, వెంకటాచలం పల్లి- దొనకొండ (వయా రెడ్డెనపాలెం, పడమర గంగవరం)కు రూ. 9కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వివరించారు. ముఖ్యమంత్రి అయా రోడ్ల నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంజూరు చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టికి కృతజ్ఞతలు తెలిపిన తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలు …
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రత్యేక శ్రద్ధ, కృషితో తూర్పు గంగవరం – తాళ్లూరు రోడ్డు అభివృద్ధికి రూ.4.80 కోట్లు మంజూరు చేయించినందుకు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కి, తాళ్లూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లూరు మండల ప్రజల చిర కాల కోరిక ఎమ్మెల్యే కృషితో నెరవేరనున్నట్లు వారు హర్షం వ్యక్తం చేసారు. హర్షం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపిన వారిలో వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, పలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా లు, ఉన్నారు.
