తాళ్లూరు వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1991 – 92వ విద్యాసంవత్సరంలో పదవతరగతి విద్యను అభ్యసించి నేడు వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ఆదివారం తాళ్లూరు వికే ప్రభత్వ పాఠశాలలో కలుసుకున్నారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ మాస్టర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాడు పాఠశాలలో ఓనమాలు నేర్పు నేడు జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగటానికి ఉపయోగపడిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నాటి ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, వెంకట రెడ్డి, కోటి రెడ్డి, చంద్రశేఖర్ లు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన విద్యార్థులను దీవించారు. నాడు పాఠశాలలో అల్లరి చిల్లరగా చేసిన అల్లరి, కష్టపడిన విధానాలను వివరించారు. దేశం, గ్రామం, పాఠశాల అభివృద్ధి కోసం ఉపయోగపడి జీవితాన్ని మరింత ఉన్నంతగా చేసుకోవాలని దీవించారు. కష్టంలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలని, అదే జీవితంలో నిజమైన స్నేహానికి పరమార్ధం అని ప్రభోధించారు. స్నేహితులు ఒకరి కొకరు ఆలింగనం చేసుకుని చిన నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, వెంకట రెడ్డి, కోటి రెడ్డి, చంద్రశేఖర్ , నాగయ్య మాస్టర్లలను ఘనం గా సత్కరించుకున్నారు. గురువులకు గిఫ్ట్ లు అందించి మెమెంటో బహుకరించారు.కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు మారం అంజిరెడ్డి, కోట శ్రీనివాసరెడ్డి, గూడా శ్రీధర్, చందోలు శివరామకృష్ణ, చందోలు రవికుమార్,కోట సుబాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనాటి రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులు కలిసి మెలిసి భోజ నం చేసి ఆనందాన్ని పంచుకున్నారు.











