దర్శి మండలంలోని వెంకటాచలపల్లి సమీపంలో గల జగనన్న కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. లబ్ధిదారులు కట్టుకుంటున్న జగనన్న కాలనీల వద్ద ఏర్పాటు చేసుకున్న సెంట్రింగ్ డబ్బాలను ఎత్తుకెళ్లారు. రెండు ఇళ్ల వద్ద ఏర్పాటుచేసిన 149 సెంట్రింగ్ డబ్బాలను ఎత్తుకెళ్లినట్లు చలివేంద్రానికి చెందిన బాధితుడు తాళ్లూరి పౌలు తెలియజేసాడు. వాటి విలువ సుమారు రెండున్నర లక్షల రూపాయల పైనే ఉంటుందని బాధితుడు వాపోయాడు. న్యాయం చేయాలంటూ బాధితుడు పౌలు తెలిపాడు.
