తాళ్లూరు మండలం లోని దోసకాయలపాడు సచివాలయ పరిధిలో సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. దోసకాయ లుపాడు సర్పంచ్ కోట శివలక్ష్మి వెంకట్రామిరెడ్డి, బెల్లంకొండ వారిపాలెం సర్పంచ్ పి సుమలత శ్రీకాంత్ రెడ్డి ల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈఓఆర్డి కేజిఎస్ రాజు మాట్లాడుతూ… గ్రామ వలంటీర్లు ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులను గుర్తించడమే కాక ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారిని గుర్తించి వారికి సంబంధించిన మంజూరు పత్రాలను అందించడానికి జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటికే వలంటీర్ల ద్వారా సేకరించిన వారికి అన్ని రకాల ధ్రువపత్రాలు వచ్చాయని నేడు ప్రజా ప్రతినిధుల సమక్షంలో కొంతవరకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తదుపరి గ్రామ వలంటీర్లు తమ పరిధిలోని గృహస్థులకు మంజూరు పత్రాలు అందించడం జరుగు తుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గూడా సరస్వతి ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ ఇమ్మానుయేల్, గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు ,వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


