విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహణ – వ్యవసాయాధికారి ప్రసాదరావు
చిరుధాన్యాలు ఎదిగే పిల్లల మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం విద్యార్థులకు చిరు ధాన్యాల వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ
.. చిరుధాన్యాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, విద్యార్థులు తమ ఉపయోగించే ఆహారంతో పాటు ప్రతిరోజు చిరుధాన్యాలు ఉపయోగించినట్లయితే మానసిక ఉల్లాసంతో పాటు ఉత్సా హంగా ఆరోగ్యవంతంగా వారిలో ఎదుగుదల ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ కుమార్, ఇన్ఛార్జ్ ప్రధానో పాధ్యాయులు వెంకాయమ్మ, గ్రామ వ్యవసాయ సహాయకులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

