వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సిగ్గుచేటని ఎంపీపీతాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు నిరసనగా వలంటీర్లు మంగళవారం
నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం
వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వలంటీర్లకు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు నిలిచారు. కార్యక్రమంలో వైస్ ఎం.పి.పి లు ఎడమకంటి వెంకటేశ్వర్ రెడ్డి,నాగ ప్రియాంకనాగార్జునరెడ్డి, సొసైటీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీసభ్యులు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు మేకల చార్లస్ సర్జన్, వలి, పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ గూడ సరస్వతి ప్రభాకర్రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, ఉపసర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ సభ్యులు సోము అనిల్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచులు , ఎంఎల్ ఓ బీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, వైకాపా నాయకులు ముచ్చుమురి బ్రహ్మారెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (చందన), చాట్ల ఇమ్మానియేలు, గుద్దేటి శ్రీనివాసరెడ్డి, జెసిఎస్ కొర్రపాటి వారి పాలెం కన్వీనర్ విష్ణు, వికాస్ పాల్గొన్నారు.
