బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతిని దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యక్తం చేశారు . ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ఫంక్షన్ కు వెళుతున్న పెళ్లి వారి బస్ కు ఎదురుగా మరో బస్సు రావడంతో ఇటువంటి ప్రమాదం జరిగిందని తెలిసిందన్నారు. ఎదురుగా వచ్చిన ట్రావెల్స్ బస్ ఎవరిది అని కూడా పోలీసు వారునిర్ణయిస్తున్నారన్నారు…చనిపోయిన వారికుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు.
బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సి యం వై యస్ జగన్మోహన్ రెడ్డి
దర్శి ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా,తీవ్రంగా గాయాలైన వారికి 2 లక్షల రూపాయలు ,స్వల్ప గాయాలైన వారికి 50 వేల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి . అందుకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
*సహాయక చర్యల్లో వైఎస్సార్ సీపీ నాయకులు*
దర్శిబస్సు బోల్తా పడిన దుర్ఘటనలో మృతులను బయటకు తీసేందుకు 7వ వార్డు కౌన్సిలర్ ఆవుల జ్యోతి శివారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ అమీన్ బాషా (మిల్లర్ బుజ్జి) తదితర నాయకులుకొత్తరెడ్డి పాలెం గ్రామవాసులు, దర్శి పట్టణ వాసులు సహాయక చర్యలు చేసేందుకు ముందుకు వచ్చారు. బస్సులో నుంచి క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రమాద బారిన పడతామని కూడా లెక్కచేయకుండా వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వారికి ఉన్న వాహనాలైన పొక్లెయిన్లు, బుల్డోజర్లు, క్రేన్లను పోలీసులు కోరిక మేరకు స్వచ్ఛందంగా తీసుకు వచ్చి మోకుల సాయంతో బస్సును బయటకు లాగే ప్రయత్నం చేశారు. తాళ్లు వేసి బస్సులోని వారిని బయటకు లాగారు. అలాగే కాలువలోకి నిచ్చెనలు వేసి బస్సులోని వారిని పైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.