దర్శి వద్ద సాగర్ కాలువలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు క్షణాల్లో..ప్రాణాలు గాల్లో..

“పెళ్లి సందడి సంతోషం.. అంతలోనే అంతులేని విషాదం, రిసెప్షన్ సంబరాలను ఊహించుకుంటూ బయలుదేరిన కొద్ది సేపటికే ఊహలు సమాధి అయ్యాయి. అర్ధరాత్రి.. అంతా చిమ్మ చీకట్లు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఏడుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అప్పటి వరకూ తమతో సంతోషంగా గడిపిన వారు ఇకలేరు అన్న విషయం వారి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. గాయపడిన వారు ఒక వైపు, అయిన వారి మృతదేహాలు మరో వైపు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

“పొదిలి పట్టణంలోని ఎన్టీఓ కాలనీలో గౌస్ మొహిదీన్ కుటుంబం నివాసముంటోంది. ఆయన కుమారుడు సిరాజ్ సౌదీలో ఉంటున్నారు. వారితో పాటు ఆయన ఉంటున్నాడు. కుమార్తె ఫాతిమాను కాకినాడకు చెందిన అక్బర్ షరీఫ్తో వివాహం చేయాలని నిశ్చయించారు. వివాహం ఘనంగా జర పాలని తలంచారు. సౌదీ నుంచి అందరూ పొదిలికి చేరుకున్నారు. గత ఆదివారం పట్టణంలో అంగరంగ వైభవంగా కుమార్తె వివాహం జరిపించారు. రిసెప్షన్ కాకినాడలో పెట్టుకున్నారు. బంధు మిత్రులను పొదిలి నుంచి తీసుకెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన ఇంద్రా బస్సును అద్దెకు తీసుకు న్నారు. రాత్రి పది గంటలకు బయలుదేరి, తెల్లవారి ఆరు గంటలకు కాకినాడ చేరుకుంటారు. పగలంతా ఫంగ్టన్లో ఉండి, రాత్రికి బయలు దేరి పొదిలికి చేరు కోవాలనేది వారి ఆలోచన, ఒక్క డ్రైవర్ అయితే ఇబ్బంది ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యంతో
మాట్లాడి రెండో డ్రైవర్ కూడా అవసరమని చెప్పారు. ఇద్దరు డ్రైవర్లతో రాత్రి 12.15 గంటలకు బయలు దేరారు. బస్సులో బంధుమిత్రులు కొం దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి కొందరు నిద్ర పోతున్నారు. సరిగ్గా బస్సు బయలు దేరిన 20 నిముషాల్లోపే ఒక్క సారిగా డివైడర్ను ఢీకొట్టిన బస్సు కాలువలో ముందు వైపు కిందకు వేలాడినట్లు పడింది.
బస్సులో ఉన్నవారంతా ఒక్క సారిగా ముందుకు పడ్డారు. ఒకరిపై ఒకరు పడి ఏం జరిగిం దో అర్థం కాక హాహాకారాలు చేశారు. సీట్లలో నుంచి అందరూ ఒక్కసారిగా కింద పడి పోవడంతో ముందున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతా చిమ్మ చీకట్లు ఏం జరిగిందో తెలియక ఎలా బయటకు రావాలో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గుర య్యారు. డ్రైవర్ వైపు నుంచి బయటకు వచ్చిన కొందరు తమ బంధువులకు ఫోన్లు చేసి జరిగిన విషయం తెలిపారు. బస్సు డ్రైవర్ రమేష్ 100కి సమాచారం అందించాడు..’
మృతదేహాలను పొదిలికి తరలించిన సమయంలో వారి గృహాల వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి.

దర్శి వద్ద సాగర్ కాలువలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
అత్త, కోడలు మృతదేహాలు ఒకేసారి…
పెండ్లికుమార్తె పెద్ద మేనత్త ముల్లా మార్జహాన్ (58), ఆమె కోడలు సబియా ప్రమాదంలో మృతి చెందారు. రెండు మృతదేహాలు ఒకే సమయంలో ఇంటి వద్దకు చేరుకోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోది స్తున్నారు. కోడలు పెళ్లి చూశాం.. రిసెప్షన్ కూడా చూసి రావాలని కాకినాడ బయలుదేరిన వారు, తిరిగిరాన లోకాలకు చేరాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రిసెప్షన్కు వెళ్లి.. అందరినీ చూడాలని….
పెండ్లికుమార్తె బంధువు అయిన ముల్లా జానీబేగం (65) రిసెప్షన్కు వెళ్లి బంధువులు అందరినీ చూడాలని బస్సులో బయలుదేరింది. కానీ దురదృ ష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. వయసు మీద పడుతోంది కదా.. అందరినీ చూడాలి అన్న ఆమె కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు దేరిందని కుటుంబ సభ్యులు, బందువులు విలపిస్తు న్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఉపాధ్యాయుడు కాగా, మరొకరు రైల్వే పోలీ నుగా పనిచేస్తున్నారు.

బాధితులకు అండగా…..
దర్శి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో క్షతగాత్రులు ఒంగోలులో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కిమ్స్ లో నలుగురు, వెంకట రమణ ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స కోసం చేరారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న బస్సు డ్రైవర్ కాలికి తీవ్రమైన గాయం కావడంతో కుటుంబ సభ్యుల మెరుగైన వైద్యం కోసం చెన్నై తీసుకెళ్లారు. దీంతో కిమ్స్ ముగ్గురు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. సబీరుల్లాకు మోకాలులో రక్తం గూడు కట్టుకుందని, ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. యాజ్దానీకి మాత్రం పక్కటెముక, తుంటి ఎముక పాక్షికంగా విరిగిందని ఆపరేషన్ అవ సరం లేకుండా నయమవుతుందన్నారు. సలీమున్నీ సాకు కూడా ఎడమ ఛాతిలో గాయం అయిందని. నాలుగు రోజులు పర్యవేక్షించాల్సి ఉందన్నారు. ఒంగోలులోని కిమ్స్, వెంకట రమణ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి యాదాల అశోక్ బాబు పరామర్శిం చారు. వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ప్రమాద సంఘటన బాధాకరం
జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, వైసిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి.

బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందటం బాధాకరమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని, దర్శిలో మృతుల కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కూడా సంఘటనకు గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదంలో తీవ్రగాయాలైన వారిని 108 వాహనాల్లో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొందరి పరిస్థితి విషమించ టంతో ప్రత్యేక వాహనాలలో ఒంగోలు, అమరావతి తరలించారు. అక్కడ వైద్యులతో ఫోను ద్వారా సంప్ర దించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిం చాలని సూచించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రమాద ఘటనలో బాధితులకు, మృతుల కుటుంబా లకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ భరోసా ఇచ్చారు. బస్సు ప్రమాద సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం దర్శి ప్రభుత్వ వైద్యశాలలోని మృతదే హాలను పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యాన్నిచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసు, రవాణా, రోడ్లు భవనాల అధికారులతో జాయింట్ కమిటీని నియ మించి సంఘటనకు గల కారణాలను పరిశోధన చేయాలని ఆదేశించామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఎవరైనా సంఘటనకు బాధ్యులై ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటన జరిగిన వెంటనే 100 కు ఫోన్ వచ్చిందని, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్ బీ, రవాణా,
108 వాహన సిబ్బంది, వైద్య సిబ్బంది అప్రమత్తమై ఆ ప్రాంత ప్రజల సహకారంతో ప్రమాద బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారని ఆయన తెలిపారు.
మృతుల్లో ఒకరికి వైఎస్సార్ బీమా వర్తిస్తుందని తెలిపారు. మిగతా వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి సహాయం అందేలా చూస్తామని చెప్పారు.

దర్శి ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్ర్భాంతి – బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ప్రమాద ఘటనపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ సుప్రజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్య క్షుడు పీవీ శివారెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ షేక్ మహబూబ్, హజ్ కమిటీ డైరక్టర్ షేక్ మహమ్మద్ బాష, ఎస్ పీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ సత్తార్, ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ రఫీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా: ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
బస్సు ప్రమాదం వార్త తెలిసిన వెంటనే హుటాహు దర్శి వెళ్లిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి సం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను సందర్శించి, నివాళులర్పించారు. క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం పొదిలిలో విలేకర్ల సమావేశంలో కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడారు. ప్రమాద విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఒక్కొక్క మృతుని కుటుంబా నికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ప్రకారం ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దిగ్భ్రాంతి…
సాగర్ కాలువలో బస్సు పడి మృతి చెందిన సంఘటనలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాలకు ప్రకటించిన పరిహారం పై హర్షం వ్యక్తం చేశారు.
*సహాయక చర్యల్లో వైఎస్సార్ సీపీ నాయకులు*
దర్శిబస్సు బోల్తా పడిన దుర్ఘటనలో మృతులను బయటకు తీసేందుకు 7వ వార్డు కౌన్సిలర్ ఆవుల జ్యోతి శివారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ అమీన్ బాషా (మిల్లర్ బుజ్జి) తదితర నాయకులుకొత్తరెడ్డి పాలెం గ్రామవాసులు, దర్శి పట్టణ వాసులు సహాయక చర్యలు చేసేందుకు ముందుకు వచ్చారు. బస్సులో నుంచి క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రమాద బారిన పడతామని కూడా లెక్కచేయకుండా వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వారికి ఉన్న వాహనాలైన పొక్లెయిన్లు, బుల్డోజర్లు, క్రేన్లను పోలీసులు కోరిక మేరకు స్వచ్ఛందంగా తీసుకు వచ్చి మోకుల సాయంతో బస్సును బయటకు లాగే ప్రయత్నం చేశారు. తాళ్లు వేసి బస్సులోని వారిని బయటకు లాగారు. అలాగే కాలువలోకి నిచ్చెనలు వేసి బస్సులోని వారిని పైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *