మొక్కల్లో పోషక లోపాలు ఆకుల్లో సృష్టంగా కన్పిస్తాయని వెంటనే తగిన పోషకాలను అందించి, లోపాలను నివారించ గల్గితే, అధిక దిగుబడులు సాధించవచ్చని దర్శి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అర్ . బాలాజీ నాయక్ అన్నారు.
సాగంబొట్ల పాలెం గ్రామంలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మరియు వ్యవసాయ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన, రైతులకు సమగ్ర పోషకాల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పోషక లోపాలను సవరించుకొని అంశాలను తెలియజేశారు. మద్రాస్ ఫెట్టిలైజర్స్ డిప్యూటీ మేనేజర్ పి. పి. చంద్రశేఖర మాట్లడుతూ… సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వ్యర్థాలు, పంట మార్పిడి, మిశ్రమ పంటలు, రసాయన ఎరువులను తగు మోతాదుల్లో, అవసరమైనవి వాడుకోవాలని, దానినే సమగ్ర పోషకాల యుజమాన్యం అంటారని, ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం ద్వారా అమలు చేయబడుచున్న ఈ కార్య క్రమంలోమందు వ్యవసాయాది కారి ప్రసాదరావు మాట్లాడుతూ.. యజమాన్య పద్దతులైన సహజ మిత్ర పురుగులను కాపాడటం, తెగుళ్ల ను తట్టుకునే వంగడాలను ఎంపిక చేసుకోవడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం జోడించి అవసరం మేరకు వాడు కోవాలని తెలిపారు.
వి.ఎ.ఎ నరేష్ తదితరులు పాల్గన్నారు.


