దర్శి నగర పంచాయతీలోని పరిస్థితి దారుణంగా తయారైంది. చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడిగా అక్కడి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పుట్ట బజార్ స్థానికులు చెబుతున్నారు. రాత్రులు మట్టి తోలకాలు కూడా ఆ రూట్లో ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందంటూ మరో వైపు చెబుతున్నారు. వర్షం పడితే రోడ్లపై నీళ్లు నిలిచిపోయి బురద బురదగా మారి ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్ టైం లోనే కాకుండా ఇలాంటప్పుడు కూడా మా వైపు చూడాలంటూ వారు కొరుతున్నారు. ఆ రూట్లో మట్టి తోలకాలు నిలువరించి రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు.
