తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో సాగర్ కాలువకు చెందిన స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో తహసీల్దార్ కె.వెంకటే శ్వరప్రసాద్, ఎన్నెస్పీ ఏఈ పవన్ లు గురువారం సంయుక్తంగా సర్వే జరిపారు. గ్రామంలో సాగర్ కాలవలపై ఎన్నెస్పీ అధికారుల వాహన రాకపోకలకు ఉన్న కాలువ స్థలాలను గ్రామస్తులు యదేశ్చగా ఆక్రమించి తమ ఇష్టానుసారం శాశ్వత కట్టడాలు చేపడుతున్నారని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నెస్పీ అధికారులు తమ పరిధిలోని భూమి ఎంతవుందో సర్వే జరపాలని రెవెన్యూ అధికా రులను కోరటంతో ఇరుశాఖల అధికారులు జాయింట్ సర్వే చేపట్టారు. విఆర్వో, సర్వేయర్లు హద్దు రాళ్లు సరిగా గుర్తించలేక పోవటంతో సర్వేను వాయిదా వేశారు. కార్యక్రమంలో విఆర్వో కె.రాఘవరెడ్డి, గ్రామ సర్వేయర్ చంద్రశేఖరరెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
